Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్య మూవీ కోసం వినాయక్ పరిశీలిస్తోన్న టైటిల్!

  • వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ
  • జోరుగా సాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు
  • అచ్చొచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యంలోనే కథ      
బాలకృష్ణ హీరోగా ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి దర్శకుడు వినాయక్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన పనులను పూర్తిచేసిన ఆయన, ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసే పనిలో నిమగ్నమై వున్నాడట. సి. కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు.ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన సినిమాలు చేయడంలో వినాయక్ సిద్ధహస్తుడు. ఇక ఈ తరహా సినిమాలు చేయడం బాలకృష్ణకి కొట్టినపిండి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'చెన్నకేశవ రెడ్డి' వచ్చింది కూడా. ఇప్పుడు వీరి కాంబినేషన్లో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా టైటిల్ విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తితో వున్నారు. కథ ప్రకారం ఈ సినిమాకి 'ఎకే 47' అనే టైటిల్ ను వినాయక్ పరిశీలిస్తున్నారట. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.    
balakrishna
vinayak

More Telugu News